గురువే దైవం గురువే సర్వం గురువే నా ప్రాణం - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

గురువే దైవం గురువే సరస్వ గురువే నా ప్రాణం 

మా గురు సేవలు చేయుటయే ఈ జన్మకేంతో భాగ్యం మా జన్మకేంతో భాగం....!! 

// గురువే దైవం //

వదలకు స్వామి ఇప్పుడు నువ్వు ఆ పుణ్య పాదం... 

అందరికి అది దొరకదు స్వామి ఇంతటి ఈ మోక్షం.... అదియే పరమార్ధం.....!!

// గురువే దైవం // 

అయ్యప్పటే అమ్మానన్నని అర్థము తెలిపావు. పరమార్దము చూపావూ 

ఆ పై నీవు గురువే దైవం అయ్యి చూపినావు, స్వామి చెంత చేర్చినావూ.......!!

// గురువే దైవం //

కార్తిక మాసం వచ్చిందంటే కలలోకొస్తావూ మమ్ముల కలవార పెడతావూ... 

 గురు స్వామి నువు ప్రాణం అంటూ మాలలు వేస్తావూ, నియమాలను చెబుతావూ.....!! 

// గురువే దైవం//

మా గురు పాదం తాకినంతనే తనువు పులకరించే అణువణువు పరవశించే... 

నన్ను మించినా నాలో శక్తి ఇట్టే అగుపించే పరమార్థం కనిపించే.......!! 

//గురువే దైవం //

పలుమార్లు పడి పూజలు చేసిన పుణ్య కరములయ్యా ఆ కర కమలములయ్యా....

 శిష్యుల శిరస్సు నిమిరేనయ్యా జన్మ ధన్యమయ్యా మా జన్మ ధన్యమయ్యా....!! 

//గురువే దైవం//

పూవులతో మాలలు వేసి వారిని మర్చావూ...... ఒకే కులమును చేశావూ.... 

మాలో కోలువైనహంభావముల నణచి వేసినావూ... స్వామి మార్చినవు.....!! 

//గురువే దైవం //

శిష్యులందరిని చిరునవ్వులతో ఆశీర్వదిస్తావూ స్వామి దీవేనలిస్తవు .... 

మా కనుల ముందరా కానాడే అయ్యప్పకు ప్రతిరూపం.. ఆ గురువే ఆ రూపం 

//గురువే దైవం //

శ్రీ జనార్ధన్ గురు స్వామి 


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!