93. సంతసంబు సంతసంబు సంతసంబహో / Santhasambu Sanhasambu - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

93. సంతసంబు సంతసంబు సంతసంబహో / Santhasambu Sanhasambu - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

సంతసంబు సంతసంబు సంతసంబహో
శబరిమలై యాత్రచేయ సంతసంబహో ||2||

కార్తికేయ మాసమందు కఠిననిష్టతో
కంఠమాల వేసుకొనగ కలుగు సంతసం
||సంత||
శరణుఘోష చేసుగొనుచు శబరిమలైకేగగా
ఇరుముడిని దాల్చివేగ ఎరిమేలి చేరగా
||సంత||
ఆటవిక వేషమందు ఆడిపాడగా
దివ్యమైన పంబనదిని తీర్ధమాడగా 
||సంత||
శబరిపీఠమందు చేరి శరము గ్రుచ్చగా
పదెనెట్టాంబడి నెక్కుచు పరవశించగా 
||సంత||
నిష్ఠతోడ నెయ్యి తెచ్చి సమర్పింపగా
అభిషేకము చేయువేల అలరుచుండగా 
||సంత||
తన్మయత్వమందు మదిని దర్శనార్దమై
స్వామియే శరణమంటూ శరణు వేడగా 
||సంత||
దివ్య భూషణములు దాల్చి వెలుగు చుండగా
మకర సంక్రాంతి జ్యోతి మనసు నిండగా
||సంత||
అయ్యప్ప శరణమంటు ఆర్తినిరగా
స్వామియే శరణమంటూ శరణు వేడగా

 ||సంత||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow