అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా / Ayya Ani Pilichina - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా

అభయమిచ్చి బ్రోచేది అయ్యప్పయే అండగా నిలిచేది ఆ

తండ్రియే | అయ్యా॥


శివకేశవ రూపమైన మోహిని పుత్రుని


పంబానది తీరాన వెలసిన బాలుని || అయ్యా॥

పులిపాలను తెచ్చిన పొన్నంబల వాసుని


తల్లి మనసు మార్చిన శబరిగిరి నాధుని అయ్యా]

మంజుమాత వలచిన మోహనరూపున


కాంతమల జ్యోతిగా వెలుగొందు స్వామిని || అయ్యా

అజ్ఞానపు పొరలను తొలిగించే దేవుని


అందరినీ ప్రేమ మీర కరుణించే మూర్తివి || అయ్యా]

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!