ముత్యాల కాంతితో వెలిగేటి మాల l అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 ముత్యాల కాంతితో వెలిగేటి మాల, 

రత్నాల కాంతితో మెరిసేటి మాల! 

కర్పూర జ్యోతిలో కలిసేటి మాల, 

కనక మణికంఠుని తులసి మణి మాల!!

||ముత్యాల||

పంబగిరి వాసుని పడగమణి మాల, 

పందళ బాలుని పావన మాల! 

పంబానది యందు మునిగేటి మాల, 

పరితపించే వారు కోరేటి మాల!!

||ముత్యాల|

2 జాతి మత బేధములు తొలగించు మాల, 

జగదేకవీరునితో జత కలుపు మాల ! 

రుద్రయ్య తనయుని రుద్రాక్ష మాల, 

శ్రీహరి తనయుని శ్రీ గంధ మాల !!           ||ముత్యాల|

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!