చూడాలనున్నదయా / CHUDALANUNNADYA - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


చూడాలనున్న దయా చూచి తరియించు భాగ్యమయా


నిన్ను చూడాలననుకుంటే వేవేల జన్మాల పుణ్యం వెంటుండాలయ్యా 


||చూడాలనున్న దయా||


స్వామియే శరణమయ్యప్పా స్వామియే శరణమయ్యప్పా ॥2॥


ఆ శబరి గిరిపై ... ఓహో... ఓహో ! ... ఓహో ! ఓహో


ఆ ! శబరి గిరిపైన నీ ! గర్భ గుడిలోన నిను చేరె ఆ ! నీటి బిందువుకున్నంత 

నీ పూజ చేసేటి పత్రంకున్నంత 

నీ ! పాదముల చెంత పువ్వుల కున్నంత 


ఆ ! పాటి భాగ్యము మాకేది స్వామి మరుజన్మ మాకుంటే కలిగించు స్వామి మణికంఠ స్వామి


స్వామియే శరణమయ్యప్పా స్వామియే శరణమయ్యప్పా ॥211


11చూడాలనున్న దయా11


తనువున్న వరకు... ఓహో .... ఓహో !.... ఓహో !.... ఓహో 


తనువున్న వరకు నీ ! కొండకొస్తా నిండైన రూపాన్ని నే ! చూసి వస్తా ఒకవేళ నీ ! కొండ రాలేకపోతే గుడ్డుడినై నా ! కంట నిన్ను చూడకుంటే అంతటితో ఈ ! జన్మ చాలించు స్వామి నీ ! పాదముల చెంత చోటివ్వు స్వామి 

మణికంఠ స్వామి 11 2 11


స్వామియే శరణమయ్యప్పా స్వామియే శరణమయ్యప్పా ॥2॥


11చూడాలనున్న దయా11


కనులుండి కూడా ... ఓహో... ఓహో !... ఓహో ! ... ఓహో కనులుండి కూడా కబోదైనాను 

మంచేదో చెడుయేదో తెలియక ఉన్నాను.


పాపాల పుట్టోలె పెరుగుతు ఉన్నాను ఇహలోక బంధాలలో బందీనైనాను మోక్షాన్ని నే కోరి వచ్చాను స్వామి - మనసున్న మా ! మంచి మణికంఠ స్వామి మన్నించు స్వామి


స్వామియే శరణమయ్యప్పా స్వామియే శరణమయ్యప్పా ॥2॥


11చూడాలనున్న దయా11






#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!