73. నువ్వే నా గానమయ్యా / Nuvve Na Ganamayya - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

73. నువ్వే నా గానమయ్యా / Nuvve Na Ganamayya - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

నువ్వే నా గానమయ్యా నువ్వే నా ప్రాణమయ్యా ||2||
నీ దయ ఉంటే చాలయ్యా
ఓ అయ్యప్ప దేవా జన్మంతా నీ సేవ చేతునయ్యా ||2||||కో||
నా గుండె కోవెల చేసి నిను కొలుఉంచానయ్యా||2||
నా మనసే హారతి ఇచ్చాను
ఓ అయ్యప్ప దేవా నాలోనే నిను చూసుకున్నాను
||నువ్వే నా గానం అయ్యా||
నోరార నీ గానాన్నే మనసారా పాడుతూనయ్యా
పాటల మాలలల్లి నీకే అర్పింతునయ్యా
రాగాల పల్లకిలోన
ఓ అయ్యప్ప దేవా
నిన్ను ఊరేగింతునయ్యా||2||
||నువ్వేనా గానమయ్య||
రతనాల కాంతి కంటే రమణీయ రూపుడు నీవే
ముత్యాల మెరుపు కంటే ముద్దుల బాలుడు నీవే
ఒక్కసారి నిన్నే చూసిన మా అయ్యప్ప దేవా లెక్కలేని బాధలు తొలుగునయ్య
ఓ అయ్యప్ప దేవా లెక్కలేని బాధలు తొలుగునయ్యా
||నువ్వేనా గానమయ్య||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow