నందా మాయే
మాకా నందామాయే
నందా మాయే
మాకా నందామాయే అయ్యప్ప నీతోటి మాకు బంధామాయే
మణికంఠ నీ తోటి మాకు బంధామాయే
// నందమాయే // // 2 //
మాదృష్టికి అయ్యప్ప నీ బొట్టున్నది.
ఆ బొట్టులోనే శబరికి తొలి మెట్టున్నది
మెట్లు ఎక్కినోళ్ళకెంతో మేలున్నది
ఆ మేలులోనే కోదవలేని పుణ్యమున్నది
// నందమాయే //
మా మెడలో నీ రుద్ర మాలున్నది
ఆ మాలల్లో స్వామి నీ మహిమ ఉన్నది
మహిమల్లోన మంచి భక్తి ఉన్నది
ఆ భక్తి మరువకుండా నిన్ను తలవమన్నది
// నందమాయే //
మా నాలుక మీద నీదే నామమున్నది
స్వామి మా మీద నీ చల్లని చూపున్నది
చూపుల్లో సూర్యతేజ కాంతి ఉన్నది
ఆ కాంతిలోన అంతులేని శాంతి వున్నది
// నందమాయే //
మా వంటి మీద నీదే కాశయమున్నది
కాషాయములో స్వామి అభయ హస్తమున్నది
ఆ హస్తములో ఆదిపరాశక్తి ఉన్నది
ఆ శక్తిలో అయ్యప్ప మకరజ్యోతి ఉన్నది
// నందమాయే
/
/