పల్లవి :
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చేవమ్మా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
చరణం :
పసి బాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి
పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన కలహంస నడకలతో రావమ్మా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందుమ్మా
వేయి నామాల కల్పవల్లి వేయి మారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి
సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కల్గి
ఆయుర్ వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చె తల్లి
ఆయుర్ వృద్ది అష్టైశ్వర్యము ఐదవతనములిచ్చే తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
నవరత్నాలు నీ నగుమోమే తల్లి వరలక్ష్మీ కనకరాశులు కళ్యాణి
కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మి
శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా