గురుదేవులే మా గురుదేవులే గురువిన్ గురువే మా గురుస్వామి - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 గురుదేవులే మా గురుదేవులే 

గురువిన్ గురువే మా గురుస్వామి | 

అయ్యప్ప స్వామి మా గురుస్వామి  ॥ గురు ॥


మాలలే వేస్తారు ఇరుముడిని కడతారు 

ఎంత కష్టమైనా గాని వ్రతమును చేయిస్తారు  ॥ గురు ॥


ఎరుమేలి చేరుస్తారు పేటతుళ్ళి ఆడిస్తారు 

ఎంత కష్టమైనా గాని నిండైనహాయి గొలుపుతారు ॥ గురు ॥


అళుదాను చేరుస్తారు అళుదస్నానం చేయిస్తారు 

ఎంత కష్టమైనా గాని కరిమలను ఎక్కిస్తారు  ॥ గురు ॥


పంపాను చేరుస్తారు పంపస్నానం చేయిస్తారు 

ఎంత కష్టమైనా గాని విందిచ్చి హాయిగొలుపుతారు ॥ గురు ॥


సన్నిధానం చేరుస్తారు అయ్యప్పను చూపిస్తారు 

ఎంత కష్టమైనా గాని జ్యోతినీ చూపిస్తారు  ॥ గురు ॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!