మా గురుస్వామి మంచి గురుస్వామి - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 మా గురుస్వామి మంచి గురుస్వామి 

మాలవేసి మాకు వ్రతమునిచ్చినాడు  =మా=


ఎరుమేలిలో మాతో ఆడిపాడినాడు 

ఆడలేని వారిని ఆడించినాడు  =మా=


అళుదా కొండను దాటలేని మమ్ము 

దయచూపి మమ్ము దాటించినాడు  =మా=


కరిమల మేము ఎక్కలేకుంటే 

కరుణతో మాకు తోడుండినాడు  =మా=


పంపలో మేము స్నానమాడివస్తే 

విందిచ్చి మాకు హాయి గొలిపినాడు  =మా=


నెయ్యాభిషేకం చేయించినాడు 

ముక్తినొసగు స్వామిని చూపించినాడు  =మా=


తప్పులెన్ని వున్నా క్షమించినాడు 

అభయమిచ్చి మమ్ము ఇల్లు చేర్చినాడు  =మా=

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!