ఏమిజేతు నీదుపూజ ఎట్లజేతునీదుసేవ
మాలవేసుకుందమంటె పూజవిదము తెలియదాయె
నీ పూజవిదము వింటుంటే స్వామి ఓ అయ్యప్ప
నిదురరంతా కరువాయే స్వామి ఓ అయ్యప్ప
"మాలైతేవేసుకుంటి దీక్షనేమో పూనుకుంటి"2"
"నల్లాటిబట్టలేసి నుదుటగంధం బొట్టుపెట్టి"2"
శరణమంటే సిగ్గాయే స్వామి ఓ అయ్యప్ప శరణుఘోషరాకపాయె స్వామి ఓ అయ్యప్ప
"ఇరుమూడిఎత్తుకోని ఎరుమేలి దరికిజేరి"2
పెదపాదంపోదమంటె ఆలుపిల్ల యాదికొచ్చె
కరిమాలగుట్టంటే స్వామి ఓ అయ్యప్ప కాళ్ళుచేతులోనవట్టే స్వామి ఓ అయ్యప్ప
"కిందమీద పడుకుంటూ కరిమాల గుట్టనెక్కి"2
"పాపాలు పోతయని పంబనది చేరుకుంటి"2
పాపాలుపారిపాయె స్వామి ఓ అయ్యప్ప ప్రాణంఅలసటదీరే స్వామి ఓ అయ్యప్ప
"కన్నెమూలగణపతిని కనులారా సేవించి"2
"కష్టాసుఖములనక కాంతమలై గిరిజేరితి"2
పద్దెందిమెట్లనెక్కి స్వామి ఓ అయ్యప్ప పావనుడనైపోతిని స్వామి ఓ అయ్యప్ప
కోటిసూర్యకాంతిగలస్వామి ఓ అయ్యప్ప దివ్యమైన రూపుజూస్తి స్వామి ఓ అయ్యప్ప
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
