అయ్యప్ప స్వామినీ చూడాలంటే - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 అయ్యప్ప స్వామినీ చూడాలంటే  కొండకు వెళ్ళాలి

అయ్యప్ప స్వామినీ చూడలంటే  కొండలకు వెళ్ళాలి
శబరి కొండకు వెళ్ళాలి     ||స్వామి||


స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
కార్తీకమాసమున మాలలు వేసి పూజలు చేయాలి    ||స్వామి||


యిరుముడికట్టి శరణము చెప్పి యాత్రకు వెళ్ళాలి
శబరి యత్రకు వెళ్ళాలి     ||స్వామి||


ఎరుమేలి వెళ్ళి వేషాలు వేసి పేట ఆడాలి
పేటైసుల్లి ఆడాలి     ||స్వామి||


ఆలుదానదిలో స్నానం చేసి రాళ్ళను తీయాలి
రెండు రాళ్ళను తీయాలి     ||స్వామి||


పంపానదిలో స్నానము చేసి పావనమవ్వాలి
మనము పావనము అవ్వాలి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!