155. శబరిమలై నౌక సాగిపోతున్నది / Shabarimalai Nowka sagipotunnadi - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

155. శబరిమలై నౌక సాగిపోతున్నది / Shabarimalai Nowka sagipotunnadi - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
స్వామియే అయ్యప్పా - అయ్యప్పా స్వామియే
శబరిమలై నౌక సాగిపోతున్నది అయ్యప్ప నౌక సాగిపోతున్నది
అందులో చుక్కాని - శ్రీమణికంఠుడు
||శబరి||
అమ్మలారా అయ్యలారా - రండి రండి మీరు
నామంబు పలికితే - నావ సాగిపోతుంది.
తెడ్డెయ్యనక్కరలేదు - తెరచాపక్కరలేదు
||శబరి||
నామంబు పలికితే - నావ సాగిపోతుంది
కదలకండి బాబు మెదలకండి బాబు
నామంబు పలికితే - నావ సాగిపోతుంది.
||శబరి||
డబ్బిచ్చి మీరు - ఈ నావ ఎక్కలేరు
భక్తితో మనము - ఈ పడవ ఎక్కగలము
నామంబు పలికితే - నావ సాగిపోతుంది.
||శబరీ||
కష్టా సుఖములు రెండు ఘనమైన కెరటాలు
నామంబు పలికితే - నావ సాగిపోతుంది.
||శబరి||
జ్ఞానమనే ధనము అందించు మనకు
నామంబు పలికితే - నావ సాగిపోతుంది
||శబరి||
మణికంఠ నౌక సాగిపోతున్నది.
కన్నెస్వామి నౌక సాగిపోతున్నది,
కత్తి స్వామి, గంట స్వామి, గద స్వామి, గురు స్వామి నౌక సాగిపోతున్నది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow