పూసిన కుసుమాలన్ని / Pusina kusumaalanni - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


పూసిన కుసుమాలన్ని ఎన్ని ఉన్నా,  అన్ని నీ సేవలోనే ధరియించునా

పుట్టిన మానవులందరూ  ఎందరున్నా
అందరు నీ సేవ చేసే భాగ్యముండునా
నిను చూడని ఈ జన్మ వ్యర్థమే కదా
నిను చేరే దారి నివ్వు హృదయేశ్వరా         (పూసిన)


శరణాలు చెప్పుకుంటు వింటున్నాము
పూజల్లో స్వాములకు దైవం నేనన్నావు
స్వామి అని పిలిచినా పలకవెందుకు........ అయ్యప్ప,
నీ పాద దాసులపై అలక ఎందుకు    (పూసిన)


అయ్యా అంటే ఆదరించి, అప్పా అంటే ఆదుకొనీ
ఆ సంభ వాసులకు అయ్యప్పగా నిలిచావు
ఆరాధించే మమ్మెందుకు ఆదుకోలేవు........... అయ్యప్పా,
శరణమనగా కరుణించవ శబరీశ్వరా        (పూసిన)


అమ్మ కోసం అడవికెళ్ళి పులి పాలు తెచ్చావు
మహిషిని వధియించి మహిమలెన్నో చూపావు
మము కావగా రాలేవా మణికంఠుడా............అయ్యప్ప,
మా ఇంట మకర జ్యోతివై ఉండవా    (పూసిన)


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!