అభిషేక శ్లోకాలు / Abhisheka Slokaalu


ఆసనం
నా నావర్ణం సమాయుక్తం పుష్పగంధైశ్చ ధూపితం |
ఆసనం దేవదేవేశ్య ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం ||
శ్రీ ధర్మశాస్తే నమః ఆసనం సమర్పయామి | (అక్షింతలు)
పాద్యం
భూతనాథ నమస్తేస్తు నరకార్ణవ తారక |
పాద్యం గృహాణ దేవేశ్య మమసౌఖ్యం వివర్ధయ ||
శ్రీ ధర్మశాస్త్రీనమః పాద్యం సమర్పయామి III (జలము)
అర్ఘ్యం
వ్యక్తా వ్యక్త- స్వరూపాయ హృషీకేశాయతే నమః
మయానివేదితో భక్త్యా అర్ఘ్యయం ప్రతిగృహ్యత్యం
శ్రీధరశాస్తేనమః అర్ఘ్యం సమర్పయామి॥ (జలము)
ఆచమనీయం
మందాకినీ సమం వారి పాపహరంశుభం |
దధితం కల్పితం దేవ సమ్యకాశద్యుతాం త్వయా ||
శ్రీ ధర్మశాస్తేనమః ఆచనీయం సమర్పయామి॥ (జలము)
పంచామృత స్నానము
అనాధనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణవప్రియ |
స్నానం పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ ||
శ్రీధర్మశాస్తేనమః పంచామృత స్నానం సమర్పయామి॥ (పంచామృతం)
క్షీరాభిషేకము (పాలు)
కామధేను సముద్భూతం దేవర్షి పితృతృప్తితాం!
పయోదధామి దేవేశ స్నానాయ ప్రతి గృహత్యాం ||
శ్రీధర్మశాస్తేనమః క్షీరాభిషేకం సమర్పయామి || (పాలాభిషేకము)
దధిస్నానం (పెరుగు)
చంద్రమండల సంకాశం సర్వదేవ ప్రియం దధి|
స్నానార్ధంతే మయాదత్తం పంచశైల నివాసినే || శ్రీ
ధర్మశాస్తేనమః దధి స్నానం సమర్పయామి|| (పెరుగు అభిషేకం)
ఆజ్యాభిషేకం (నెయ్యి)
ఆజ్యం సురాణామాహారం ఆజ్యంయథే ప్రతిష్టితం |
ఆజ్యం పవిత్రం పరమం స్నానార్ధం ప్రతిగృహ్యతాం ||
 శ్రీ ధర్మశాస్తేనమః ఆజ్యాభిషేకం సమర్పయామి|| (నెయ్యి అభిషేకం)
మధు అభిషేకం (తేనే)
సర్యౌషది సముత్పన్నం పీయూష సదృశం మధు॥
స్నానార్థంతే ప్రయచ్చామి స్వీకురుష్వ దయానిధే|
శ్రీ ధర్మశాస్తేనమః మధు అభిషేకం సమర్పయామి॥ (తేనె అభిషేకం)
గంధాభి షేకం (చందనం)
కర్పూరేలా సమాయుక్తం సుగంధ ద్రవ్యసంయుతం |
గంధోదకం మయాదత్తం గృహాణత్వం మహేశ్వర ||
శ్రీ ధర్మశాస్తేనమః గంధోదకం సమర్పయామి॥ (చందనము)
భస్మాభిషేకం (విభూతి)
విభూతిర్భూతిరైశ్వర్యం అపమృత్యుహరం శుభం |
స్నానార్థంతే ప్రయచ్చామి గృహ్యతాం సురనాయక ||
శ్రీధర్మశాస్త్రీనమః విభూతి స్నానం సమర్పయామి॥ (విభూతి)

కలశోదక స్నానం

నానా నదీసమానీతం సువర్ణకలశస్థితం |
శుచోదకేన సుస్నానం గృహ్యతాం హరినందన |
శ్రీ ధర్మశాస్తేనమః శుచోదక స్నానం సమర్పయామి || (కలశ జలము)
వస్త్రం
వేదసూక్త సమాయుక్తే యజ్ఞసామసమన్వితే |
సర్వవర ప్రదేదేవ వాసనే సంగృహాణభే ||
శ్రీ ధర్మశాస్తేనమః వస్త్రం సమర్పయామి || (వస్త్రము)
ఉపవీతం
బ్రహ్మ విష్ణుమహేశైశ్చనిర్మితం బ్రహ్మసూత్రకం |
గృహాణ సర్వవరద ధర్మశాస్తానమోస్తుతే || శ్రీ
ధర్మశాస్త్రీనమః ఉపవీతం సమర్పయామి II (జందెము)
గంధ అలంకారం
శ్రీకంఠ చందనం దివ్యం గందాఢ్యం సుమనోహరం|
విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతిగృహ్యతాం||
శ్రీ ధర్మశాస్తేనమః దివ్యపరిమళ గంధాంధారయామి॥ (చందన బొట్టు)
కుంకుమ అలంకారం
హరిద్రాచూర్ణ సంయుక్తం కుంకుమం కామదాయకం!
నానాపరిమళం దివ్యం గృహాణ గుణభూషితా|
శ్రీ ధర్మశాస్తేనమః అలంకరణార్థం హరిద్రా చూర్ణ కుంకుమాన్ ధారయామి॥ (కుంకుమ అలంకారం)
అక్షింతలు
అక్షతాన్ తండులాన్ శుభాన్ కుంకుమేన విరాజితాన్ |
హరిద్రాచూర్ణ సమ్యుక్తాన్ గృహణా మరందిత |
శ్రీధర్మశాస్తేనమః అక్షతాన్ సమర్పయామి॥ (అక్షింతలు)
 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!