కన్నులనిండే కమనీయ రూపం.. హరిహర పుత్రుని దివ్య స్వరూపం.. అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
0 minute read

కన్నులనిండే కమనీయ రూపం.. 

హరిహర పుత్రుని దివ్య స్వరూపం.. 

మానవ జగతికి జ్ఞానము నొసగే 

జ్యోతి స్వరూపా అయ్యప్పా..   

॥కన్నుల॥


మాలను వేసి నిను కీర్తించి 

శరణు ఘోషతో నీకై నడచి.. 

ఇరుముడి కట్టి శిరమున దాల్చి 

ఆశా మోహిత పదములు వీడి.. 

వేడుకలోన వేదనలోన కొలిచెదమయ్యా నీరూపం 

తోడుగ నిలచి వెతలను తీర్చగ పలికెదమయ్యా నీ నామం

 ॥కన్నుల॥


విరి సుమాల మాలికలల్లి 

ముక్తికోరి నీ పదములు పలికి 

నియమము తోడ నిను కీర్తించి 

నయవినయముల నిత్యము కొలిచి 

నీ అభయములె కోరిన మాకు అండగ నిలచే నీ తేజం 

నీ చరణములె తాకిన చాలు మెండుగ కలిగే సంతోషం

 ॥కన్నుల॥


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat