అందాల శివ హరి బాలా.... Andala shivahari balaa - అయ్యప్ప భజన పాటల లిరిక్స్



అందాల శివ హరి బాలా....
పందాల జన పరిపాల......
ఆ పంబా తీరాన పడగనీడ లాడిన వా డా.... 


కైలాసగిరి లోన కొలువైన నీ తండ్రి..
వైకుంఠపురమున సేద తీరిన తల్లి...
నడుమ భూలోకాన నాకోసం వచ్చినావా
బంగారు కన్నయ్య నా తండ్రి అయ్యప్ప...


ముక్కోటి దేవతలు మొక్కేటి ఇంద్రుడే...
పులి వాహన మాయే ఏ పూర్వ పుణ్య మాయే..
ఏ రీతిగా నన్ను కరుణించు దలచవో...
నీ పాద చరణాల పడియుండ నీవయ్యా...


మహిషిని కరుణించి మానవ రూపం ఇచ్చి
మాలికాపురత్తమ్మ  గా నీ పక్కన నిలిపి నావు
నీ మాల వేసి నేను నీ స్మరణ చేసినాను..
నాయందు దోషమున్న నన్ను మన్నించ రాదా. .....


నా కనులు చూసేను నీ దివ్య రూపాన్ని
నా మనసు పాడేను నీ మధుర గానాన్ని
రాగాల తోటలోని పూలన్నీ ఏరుకొచ్చి... గానాల పూలమాల నీకోసం అల్లినాను....


ధనం ఏది నాకు లేదు నీ దయ నాకు చాలు
నా జీవనం కొలు నా చుక్క నీవయ్యా....
నా ప్రాణం ఉండే దాకా
ఆ ఈ జీవం ఉండేదాక
నీ పాట పాడుతాను నీ గాన సేవలోనే తరించిపోతాను....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!