తిరుమల గిరులను ఎక్కుతువుంటే - వేంకటేశ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


తిరుమల గిరులను ఎక్కుతువుంటే స్వామి సన్నిధికి చేరుతువుంటే
గోవిందా హరి గోవిందాయని కొండ కోనలను దాటుతువుంటే
అలవికాని ఆనందం ఏదో మదిలో నిండినదోయి

కలియుగాన ఇది వైకుంఠమురా - వైకుంఠమురా
శిలగ నిలిచె శ్రీహరినే గనరా - హరినేగనరా
పిలిచిన పలికే మన దైవమురా.. కొలిచిన వారిదె భాగ్యము కదరా
ఎల్ల లోకాల నేలేవాడే వేంకటరమణుండోయి

గరుడ గమనుని మోహనరూపం- కాంచినధన్యం
పరమ పురుషుని పవిత్ర పాదం - తాకిన పుణ్యం
నారాయణ హరి నారాయణయను - నామ స్మరణమే మధురము కాదా
శరణు వేడ శ్రీ శ్రీనివాసుడే కరుణ చూపుతాడోయి

వేనవేలుగా భక్తులు చేరి - భజనలు చేసి
వేంకటేశ్వరుని గానముచేసి - భక్తిని కొలిచి
వాసుదేవ గోవింద ముకుందని స్వామి సేవలే చేయగ నిరతం
వందనాలు గైకొనుమని హరినే వేడుకొందురోయి

సనక సనందన నారదమునులే - పలికిననామం
అన్నమయ్య పద కవిత రాసి - పాడినగానం
అనవరతము నీ పాటలు రాసి ఆలపించిన అమృత గీతం
విన్నవారిదే భాగ్యమనెదరా అప్పన్నదాసుడనోయి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat