Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే - శ్రీ కృష్ణ భజన పాటల లిరిక్స్


ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే 

ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనె ॥ఏ॥


చరణములు:


1. ఉట్టిమీద పాలుపెరుగు ఎట్లు దించెనే 

కొట్టబోతే దొరకడమ్మ చిన్న కృష్ణుడు ॥ఏ॥


2. చీరలన్ని మూటగట్టి చిన్నకృష్ణుడు 

పొన్న చెట్టుమీద పెట్టి పంతమాడెనే ॥ఏ॥


3. రవికలన్ని మూటగట్టి రాధా కృష్ణుడు 

పొన్న చెట్టుమీద పెట్టీ పంతమాడెనే ॥ఏ॥


4. కాళింది మడుగులోన కలియువాడమ్మా 

వీడు బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మా ॥ఏ॥

📢 Follow