తిరుపతి యాత్రకు వెళుతూ వుంటే - శ్రీ వేంకటేశ్వరుని పాట

P Madhav Kumar

 

వరస :: ఆది తాళం  


పల్లవి :–

 
తిరుపతి యాత్రకు వెళుతూ వుంటే
తిరుమల దేవుని స్మరిస్తు వుంటే
ఏడు కొండలు ఒకే సారిగా,
ఆడుతు పాడుతు ఎక్కుతు ఉంటే ...
చెప్ప లేని మా పాపా లన్ని , పరిహర మౌతాయోయి           || తిరుపతి ||

చరణం :-1 
మంగళ రవములు పాడుతు వుంటే..., పాడుతు వుంటే
సుప్రభాతము చదువుతు వుంటే ..., చదువుతు వుంటే
జగతిని మరచి , ప్రభు సన్నిధి లో  
ఆత్మ శుద్ధిగా నిలబడి ఉంటే ...
చెప్ప లేని మా పాపా లన్ని , పరిహర మౌతాయోయి           || తిరుపతి ||

చరణం :-2
శ్రీనివాసయని వేడుతు వుంటే ..., వేడుతు వుంటే
వరము లిమ్మని కోరుతు వుంటే ..., కోరుతు వుంటే
ధగ ధగ మెరిసే చల్లని దేవుడు
ఎదుటను తానై నిలబడి ఉంటే ...
చెప్ప లేని మా పాపా లన్ని , పరిహర మౌతాయోయి           || తిరుపతి ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!