ప్రతి భక్తుని హృదయం / Prati Bhakthuni Hrudayam - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


ప్రతి భక్తుని హృదయం ఒక శబరిమల 

భూలోక కల్పతరువు శబరిమల 

||ప్రతి భక్తుని||

ఓంకారం నినదించే వేదమల 

స్వామి మనకోసం కొలువుండే ముక్తిమల

||ప్రతి భక్తుని||

వేదాంత వేద్యుడిని భక్తితో పూజించే 

మానవాళి కల్పతరువు శబరిమల 

||వేదాంత వేద్యుడిని||

ధనుర్మాస రాత్రులలో శ్వేతమల 

నెరనమ్మితే అభయమొసగు శక్తిమల

||ప్రతి భక్తుని||


స్వామినే యదమోసే భాగ్యశాలి శబరిమల భక్తజనులనోదార్చె మాతృమూర్తి ఆమల

||స్వామినే యదమోసే||

మకరజ్యోతి వెలుగొందె పుణ్యమల 

ముక్తిమార్గాన నడిపించే శబరిమల

||ప్రతి భక్తుని||





#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!