సుప్రభాతం స్వామి సుప్రభాతం //2//
మేలుకోవయ్య తూర్పు తెల్లవారే మేలుకో //2//
పూజకు వేళాయే స్వామి మేలుకో.
||మేలుకో||
మా మొరలాలించి మమ్మేలుకో సుప్రభాతం స్వామి సుప్రభాతంఅష్టదిక్పాలురు నీ ఆజ్ఞకోసమే
ఎదురుచూస్తున్నారు నీవు మేలుకో
||అష్టదిక్పాలురు||
నా గొంతు పాడింది భూపాలంనిద్రలేవరా స్వామి నా కోసం స్వామి
పంపానది నీ పాదాలు కడుగంగ
ఆరాటపడుతోంది లేవయ్యా
మా తొలి సంధ్య పూజలు గొనవయ్య
||సుప్రభాతం||
కస్తూరి గంధాలు నీ కోసమేనయ్యాకావిళ్ళలలో నెయ్యి నీ కోసమే
||కస్తూరి||
మా కళ్ళు వేచేను నీ కోసంజగమంత వేచేను నీ కోసం స్వామి
కనులార నీ రూపు దర్శించకుండిన ఈ కనులు మాకుండి ఫలమేమి
నీ పేరు తలచిన భయమేమి మేలుకోవయ్యా
