గణనాథ ఏలుమయ - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

గణనాథ ఏలుమయ ఎంతటి చల్లని స్వామివయా.. 

భజియింతు నీ నామమే దేవా -   పాలించ రావేమయా.. || కోరస్ ||


గణనాథ ఏలుమయ ఎంతటి చల్లని స్వామివయా.. 

భజియింతు నీ నామమే దేవా -  పాలించ రావేమయా..|| గణ నాథ||


అనతీ తల్లిది నువ్వు వినగానే - ఆజ్ఞకై నిలచి ఉంటివి స్వామి

అనతీ తల్లిది నువ్వు వినగానే - ఆజ్ఞకై నిలచి ఉంటివి స్వామి ||కోరస్||


శివుడే వచ్చిన బెదరక నీవు -  శక్తి తోడ నీవే ఎదిరించినావే 

శివుడే వచ్చిన బెదరక నీవు - శక్తి తోడ నీవే ఎదిరించినావే ||కోరస్||


ఎంతటి వీరుడ నిన్నూ మరువజాలం - ఏమని పొగడము నీ లీల సారం 

నేనంత వాడనయా దేవా పాలించ రావేమయా ||గణ నాథ||


నీ పుణ్య నామము తలచిన చాలు - నిను కొలిచిన స్వామి కలుగు మేలు

నీ పుణ్య నామము తలచిన చాలు - నిను కొలిచిన స్వామి కలుగు మేలు||కోరస్||


నీ బొజ్జ రూపం ఆనంద తేజం - భవ సాగరముల దొరుకును తీరం

 నీ బొజ్జ రూపం ఆనంద తేజం - భవ సాగరముల దొరుకును తీరం||కోరస్||


ప్రతి దినం నిన్ను తలచిన వాళ్ళం - పాడుకొందుము ప్రభు నీదు నామం 

మా ఇలవేల్పువయా స్వామి లాలించ రావేమయా ॥గణ నాథ|



ఈ పాటను ఎలా పాడాలి ఇక్కడ టచ్ చేసి వినండి.


*స్వామియే శరణం అయ్యప్ప*




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!