Kailasa Girivasa Song Lyrics || కైలాస గిరివాసా లిరిక్స్ – శివాయ భజన పాట


కైలాస గిరివాసా – మము పాలించు పరమేశా

కైలాస గిరివాసా – మము పాలించు పరమేశా

1. శిరముండు గంగా – మురమందు ఉరగమునూ
ధరించిన ఓ దేవా – ఓ దేవా
శరణన్న సురలను – కరుణించి బ్రోవగ
గరళమునె గైకొన – గౌరి వరా

కైలాస గిరివాసా – మము పాలించు పరమేశా

2. ముక్కంటి నీవే – దిక్కంటి నయ్యా
చిక్కులను బాపుమయ్యా – సాంబయ్య
కన్నప్ప నీకు కనులప్పగించగ
దయ చూపి దరిశనము నిచ్చావుగా

కైలాస గిరివాసా – మము పాలించు పరమేశా

3. ఓ పార్వతీశా – మాపాలి దేవా
కాపాడగా రావా – ఓ దేవా
నీపాదములనే నెర నమ్మితినిరా
మా పాపములు బాపి దరిచేర్చవా

కైలాస గిరివాసా – మము పాలించు పరమేశా

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!