ఎంత దూరమో యింకెంత దూరమో - వేంకటేశ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఎంత దూరమో యింకెంత దూరమో - వేంకటేశ భజన పాటల లిరిక్స్

 

ఎంత దూరమో యింకెంత దూరమో
ఏడు కొండల దేవాలయమెంత దూరమో

శ్రీ శీనివాసా కనిపించు దేవా
నీవు లేక క్షణమైన నిలువలేను ఇలలోనా
కాపాడగరావా ఈ దాసుల బ్రోవా

వైకుంఠవాసా ఓ వేంకటేశా
నీ దరిశన భాగ్యమ్ము మాకీయరావా
కాపాడగ రావా ఈ దాసుల బ్రోవా

శేషాద్రివాసా శరణంటి దేవా
నీ పాద దాసులము పాలింపరావయా
కాపాడగరావా ఈ దాసుల బ్రోవా

శ్రీ వేంకటరమణా నెరనమ్మితిని రావా
నీ ఆలయ దరిశనమే నిష్కృతి  నీచుల కేల్లా
జాలమేల దేవా అగుపించగరావా

అతుకు గతుకు బ్రతుకులతో విధిపాలౌ చితిగతిలో
చల్లని నీ సన్నిధిలో పెన్నిది లభియించునని
కన్న కలలు కలలేనా అంత దవ్వు రాగలనా

ఎన్నెన్నొ మెట్లెక్కి నీ దరికి చేరాము
తలవాకిట నిలబడి నీ రూపం చూశాము
కాపాడగరావా ఈ దాసుల బ్రోవా

తనివి తీర చూసితిరా తలపులు యింకేలరా
మనసునిండ నీవేరా మరుగున యింకేలరా
కాపాడగరా ఈ దాసుల బ్రోవా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow