థిం దిం దారరా ధిం దిం దారరా ధిందిం దారరా థిం దిం దార
ఇలలో పదములు కలుపుతూ జగములు ఏలుతూ
ఆడెను అయ్యప్ప ఆట ఆడెను అయ్యప్ప
పాడెను అయ్యప్ప, పాట పాడెను అయ్యప్ప
చ॥ ఎత్తుకు ఎత్తు ఎత్తేవేసి చిత్తుకు చిత్తు చిత్తేచేసి
మహిలోకొచ్చెను అసురగణం మహిషే వారికి నాయకులు
మహిలో శాంతిని నెలకొల్ప వచ్చెను అయ్యప్ప
చ॥ కామం క్రోదం మోహం లోభం మదం మాత్సర్యాలలను
మదిలోవుంచి మనిషే నేడు మహిషైనాడు మనిషిగా వారిని మార్చంగా
మహిలో శాంతిని నెలకొల్ప వచ్చెను అయ్యప్ప