కలిసివుంటేనే కదా నీకు నాకు మంచిది - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


| కలిసివుంటేనే కదా నీకు నాకు మంచిది

| విడిపోతే ఏమున్నది అంతే గతి ఇక అంతే గతి.   ll2ll


చ॥ గంజినీరు తాగినోడు మట్టిలోనే 

బండిపల్లకెక్కినోడు మట్టిలోనే.. 

మట్టిలోనే కలిసిపోయే మనకెందుకు ఈ తేడాలు

॥ కలిసివుంటేనే కదా ॥

చ॥ కుక్కకేమున్నది ఎత్తు తగ్గు తేడాలు 

కోతికేమున్నది జాతిమత భేదాలు 

నాగరికులమైన.. మనకెందు ఈ తేడాలు

॥ కలిసివుంటేనే కదా ॥

చ॥ ఎరుమేలి వావరునిదేమతం 

మణికంఠస్వామిది ఏకులం 

దేవుళ్ళకే లేని గోల..... మనుషులకు ఏలనయా 

॥ కలిసివుంటేనే కదా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!