పేటతుల్లి ఆటలాడి / Petatulli aatalaadi - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

పేటతుల్లి ఆటలాడి స్వామి సన్నిధి చేరగా
స్వామి తింతక తోం అని అయ్యప్ప స్వామి ని వేడగా.    (పేటతుల్లి ఆటలాడి)



శరణు ఘోష జల్లుమనగా, కాలి గజ్జలు మ్రోగగా
స్వామి శరణు శరణం అంటూ స్వామి పాటను పాడగా.   (శరణు ఘోష)



అటవీక వేషమంటు విసగించు కోకురా
అయ్యప్ప స్వామి కి ప్రీతి అంటూ మదిలో తలచి ఆడరా....
అందమైన స్వామి నామం మారు మ్రోగు తున్నది
ఎరుమేలి లోన స్వామి కోవెల వెలుగు లిల్లు తున్నదీ (అందమైన స్వామి)



శబరిగిరి పై  వెలిసియున్న జ్యోతి రూపుని గాంచరా
పరమ పావన పాండ్య నందన దివ్య చరితము పాడరే.   (శబరిగిరి పై  వెలిసియున్న)



పాండ్య రాజ్య మందు పెరిగీ, ఎన్నో లీలలు చూపెను
సకల విద్యలనభ్యసించి హరిహర సుతుడు పెరిగేను.     (పాండ్య రాజ్య)


స్వామి అప్పా - అయ్యప్ప
భరణం అప్పా - అయ్యప్ప
భందోమప్పా - అయ్యప్ప
ఓం గురు నాథ - అయ్యప్ప
సద్గురు నాథ - అయ్యప్ప
స్వామియే - అయ్యప్పో


ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!