బ్రహ్మచర్యము అంటే?

బ్రహ్మచర్యము అంటే? బ్రహ్మ అంటే “బ్రహ్మము" అని , బ్రహ్మము అంటే “భగవంతుడు”
అని అర్థం .చర్యము అంటే " అనుష్టింపదగినది ” అని అర్థం.
బ్రహ్మచర్యము అంటే ? " భగవంతుని కొరకు , భగవత్రాప్తి కొరకు పవిత్రతతో అనుష్టింపదగిన చర్యను బ్రహ్మ చర్యము " అంటారు .
బ్రహ్మములో చరించటాన్ని బ్రహ్మచర్యం అంటారు. (స్త్రీ సంగమము లేకుండుటయే బ్రహ్మచర్యము అనుకొనుట సరియైనది కాదు)
బ్రహ్మ చర్యం ఒక “తపస్సు” వంటిది. తపస్సు అంటే తపించబడుచున్నది అని అర్థం.
బ్రహ్మ చర్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం . మనలోని అర్థంలేని కోరికలను , మనోవికారాల స్వేచ్ఛా విహారాన్ని అరికట్టి, మన ఆలోచనలలో , మాటలలో , పనులలో , సంయమనాన్ని అలవరచి , నైతిక విలువలను పాటించేలా చేస్తుంది. ఈ
మానసిక శక్తులను వృధా చేయకుండా వృద్ధి చేస్తుంది. వాక్కుల శక్తిని వృధా చేయక వృద్ధి చేస్తుంది. “సత్య'మైన పనులను వృధా చేయకుండా వృద్ధి చేస్తుంది. .
ఆలోచనలయందు , వాక్కులయందు , కర్మలయందు , స్వచ్ఛత, పవిత్రత కలిగియుండేలా చేయడమే బ్రహ్మచర్యం యొక్క లక్షణము మరియు గొప్పతనము .
బ్రహ్మ చర్యం వలన కలిగే కొన్ని లాభాలు బ్రహ్మచర్యంతో నియమ జీవన విధానం అలవడుతుంది . పరివర్తన కలుగుతుంది .
వీర్య పుష్టి , ఇంద్రియాల పటుత్వం ఏర్పడి తద్వారా శరీరానికి బలము, ఆరోగ్యము , ఉత్సాహము , సుఖము , మనస్సుకు నిగ్రహమును, ధారణ శక్తి కలుగుతుంది .

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!