రామ రామ రామ యన్న రామ చిలుక ధన్యము -
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము //2//
అభినందనలందుకొన్న కోతిమూక ధన్యము -
ఆశీస్సులు పొందిన ఆ పక్షిరాజు ధన్యము //2//
రామరామ రామరామ శ్రీరామారామ....
//రామ రామ//
రేగుపండ్లు తినిపించిన శబరి మాత ధన్యము -
నావ నడిపి దరిజేర్చిన గుహుని సేవ ధన్యము //2//
రామరామ రామరామ శ్రీరామారామ....
//రామ రామ//
పాద ధూలి సోకినట్టి శిలయంతో ధన్యము -
వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము //2//
రామరామ రామరామ శ్రీరామారామ....
//రామ రామ//
మధురాతి మధురము రెండక్షరముల నామము -
సత్యధర్మ మూర్తిత్వము రాముని అవతారము //2//
రామరామ రామరామ శ్రీరామారామ....
//రామ రామ//
భక్తితో సేవించెడి లక్ష్మణుని ప్రేమ ధన్యము -
శరణాగతుడైన విభీషణుడెంతో ధన్యము //2//
రామరామ రామరామ శ్రీరామారామ....
//రామ రామ//
మహిమాన్వితమైనది శ్రీరామ నామ మంత్రము -
భక్తి ముక్తి దాయకము శ్రీరాముని భజనము //2//
రామరామ రామరామ శ్రీరామారామ....
//రామ రామ//
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.