మానవుడా మమత వీడరా
మమత వీడి మనసారా స్మరణ
చేయరా దేవుని స్మరణ చేయరా
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు నాదన్నది ఏది కూడా వేంటరాదురా
వెంట వచ్చునది ఏదో తెసుకొనుమురా
అదియేరా పాప పుణ్యం నరుడా ఓ మానవుడా
స్థిరమైన సంపదలు ఎన్ని ఉన్ననూ
ఉన్నవాడిననే గర్వ మెంత ఉన్ననూ
దానధర్మములు చేయని బ్రతుకువేర్ధము
అదియేరా నీవెంట వచ్చునురా మానవుడా
యవ్వనవంతుడననే గర్వమేలరా
బలమున్నది నాకని విర్రవీగకు
శక్తి లేని దేహము ఉత్తదేనురా
శక్తి ఉన్నప్పుడే భక్తిమాగమేతుకుమురా
జీవితంలో భగవంతుని స్మరణ చేయరా
అది ఏరా కడకుమిగులు ముక్తి ధనమురా
ముక్తియే కడకు మిగిలి వెంట వచ్చురా
ఆ ముక్తినే అనుసరించి సాగమురా ఓ నరుడా
కట్టే విడిసి జీవుడు వీడిపోయినప్పుడు
నీ కట్టు కూడా నీతోడు ఎవరు రారురా
వచ్చినా వల్లకాటి వరకేనూరా
అందుకేరా ఈ జీవితం ఇచ్చే సందేశమురా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.