దిగు దిగు దిగు నాగ / Digu digu Naganna l నాగరాజ భజన పాటల లిరిక్స్ I Nagaraja Bhajana Patala lyrics in Telugu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

దిగు దిగు దిగు నాగ / Digu digu Naganna l నాగరాజ భజన పాటల లిరిక్స్ I Nagaraja Bhajana Patala lyrics in Telugu

P Madhav Kumar
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..

ఇల్లలికి ముగ్గు పెట్టి నాగన్న
ఇంటా మల్లెలు జల్లి నాగన్న
మల్లెలా వాసన తో నాగన్న
కోలాట మాడి పోరా నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..

బామా లంత చేరి నాగన్న
బావి నీళ్ల కెలితే నాగన్న
బావి లో వున్నావ నాగన్న
బాల నాగు వయ్యో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..

పిల్లా లంతా చేరి నాగన్న
పుల్లా లేరా బొతే నాగన్న
పుల్ల లో వున్నావ నాగన్న
పిల్లా నాగు వయ్యో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..

స్వామూలంత చేరి నాగన్న
రేవు నీళ్ల కేళితే నాగన్న
రేవులో వున్నావ నాగన్న
ఎర్రనాగు వయ్యో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2| ..

అటు కొండ ఇటు కొండ నాగన్న
నడుమ నాగుల కొండ నాగన్న
కొండ లో వున్నవా నాగన్న
కోడే నాగు వాయ్యో నాగన్న ||


దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..


దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|.



ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow