ఈశ్వర పరమేశ్వరా ఈశ్వర పరమేశ్వరా l శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
0 minute read

 ఈశ్వర పరమేశ్వరా ఈశ్వర పరమేశ్వరా 

శ్రీశైల కొండపైన వెలిసిన మల్లీశ్వరా తండ్రి ఈశ్వరా..


మెడల నాగులున్నవి నాట్యమాడుతున్నవి, 

శిగల ఉన్న చంద్రవంక తొంగి చూస్తున్నది.. తండ్రి ఈశ్వరా.. !!2!!


పారుతున్న గంగనీ.. షిగల దాచిపెట్టి నవు, 

తల్లి పార్వతమ్మ కి నువు సవతిగ తెచ్చిచ్చినవ్ తండ్రి ఈశ్వరా..!! 2!!


పులి తోలును గట్టినా, బూడిద పూసొచ్చినా, 

నిన్ను మించు అందగాడు ముల్లోకములుండునా తండ్రి ఈశ్వరా..!!2!


కడలిని మదియించగా, గరళముద్భవించగా.. 

ధరణిని గానంగ తండ్రి గరలము సేవించెనా తండ్రి ఈశ్వరా.. !!2!!


నీ నీడకు శక్తిచ్చిన్నవ్, కాళిని సృష్టించినవ్.. 

క్రూరమైన రాక్షసులను కడతేర్చగ పంపినవ్.. తండ్రి ఈశ్వరా.. !!2!!


ఈశ్వర పరమేశ్వరా ఈశ్వర పరమేశ్వరా. 

శ్రీశైల కొండపైన వెలిసిన మల్లిశ్వరా తండ్రి ఈశ్వరా..

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat