Pasupu Kunkumula Lyrics || పసుపు కుంకుముల లిరిక్స్ – అమ్మ వారి భజన పాట

మోక్ష పదవికి పోవాలంటే మోహన రూపుని చూడా లంటే
మంగ పట్నం వెళ్లాలో రన్నో రామన్నా – అలమేలు మంగను
చూడాలో రన్నో రామన్నా

1. పసుపు కుంకుముల పళ్లేమెత్తుకొని
ప్రార్ధనలన్నియు చెంత చేర్చు కొని
భార్య బిడ్డలను వెంట బెట్టు కొని
భక్తులతో హరి భజనలు చేయుచు

మంగ పట్నం వెళ్లాలో రన్నో రామన్నా – అలమేలు మంగను
చూడాలో రన్నో రామన్నా

2. కోనేటిలో స్నాన మాడ వలెనట
కోరిన కోర్కెలు నెర వేరునట
కోటిరూప ప్రాకార జ్యోతిని
కొదవ లేక పూజింప వలెనట

మంగ పట్నం వెళ్లాలో రన్నో రామన్నా – అలమేలు మంగను
చూడాలో రన్నో రామన్నా

3. ప్రథమ ద్వారమును దాటవలయునట
ద్వార పాలకుల చూడవలెనట
ఆనంద మైన అలమేలు మంగను
అనంతరము పూజించ వలెనట

మంగ పట్నం వెళ్లాలో రన్నో రామన్నా – అలమేలు మంగను
చూడాలో రన్నో రామన్నా

4. పంచమ స్నానము చేయు వలెనట
పట్టిన చిక్కులు తొలగి పోవునట
మూర్ఖులకు ముక్తి దొరుకునట
శక్తి కొలది పూజింప వలెనట

మంగ పట్నం వెళ్లాలో రన్నో రామన్నా – అలమేలు మంగను
చూడాలో రన్నో రామన్నా

5. ఆకాశ రాజునకు ఆనంద పుత్రి ఆట
వేంకటేశునకు ధర్మ పత్ని యట
ఆంధ్రదేశమునకు వెలసియున్నదట
అలమేలు మంగమ్మ తల్లి యట

మంగ పట్నం వెళ్లాలో రన్నో రామన్నా – అలమేలు మంగను
చూడాలో రన్నో రామన్నా

6. సారె కావిళ్లు తెచ్చిన తల్లట
చెలి కత్తెలను వెంట బెట్టుకుని
అంజనేయుని కావలి యుంచి
కరివే పాకుకై తిరిగి వచ్చినట

మంగ పట్నం వెళ్లాలో రన్నో రామన్నా – అలమేలు మంగను
చూడాలో రన్నో రామన్నా

7. ఇంతలోనే కలియుగము పుట్టినట
మంగపట్నము చేరి వెళ్లినట
లక్ష్మి విష్ణు వక్షస్థలమున
ఏడు కొండలపై వెలసియున్నదట

మంగ పట్నం వెళ్లాలో రన్నో రామన్నా – అలమేలు మంగను
చూడాలో రన్నో రామన్నా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!