ఎన్నెన్ని రూపాలు ఆది పరాశక్తివమ్మ - భజన పాటల లిరిక్స్

 ఎన్నెన్ని రూపాలు ఆది పరాశక్తివమ్మ 

మొక్కుబడులు తల్లివైతివే దుర్గమ్మ 

మొక్కుబడులు మాట మరువవే మాయమ్మ

॥ఎన్నెన్ని॥

ఆలోకం విడిచి నీవు బెజవాడ చేరినావా 

బెజవాడ చేరి నీవు కనకదుర్గవైనావా 

నీ కొండకు వస్తామమ్మో దుర్గమ్మ 

బందాలను తెస్తామమ్మో దుర్గమ్మ

॥ఎన్నెన్ని॥

ఆలోకం విడిచి నీవు కైకలూరు చేరినావా 

కైకలూరు చేరి నీవు శ్యామలాంబవైనావా 

నీ గుడికే వస్తామమ్మో శ్యామలాంబ 

మొక్కుబడులు తెస్తామమ్మో శ్యామలాంబ

॥ఎన్నెన్ని॥

ఆలోకం విడిచి నీవు కొల్లేరు చేరినావా 

కొల్లేరు చేరినీవు పెద్దింట్లమ్మ వైనావా 

నీ గుడికే వస్తామమ్మో పెద్దింట్లమ్మ 

మొక్కుబడులు తెస్తామమ్మో పెద్దింట్లమ్మ

॥ఎన్నెన్ని॥

ఆలోకం విడిచి నీవు భీమవరం చేరినావా 

భీమవరం చేరినీవు మావుళ్ళమ్మ వైనావా 

భీమవరం వస్తామమ్మో మావుళ్ళమ్మ 

శరణాలు చేబుతామమ్మో మావుళ్ళమ్మ

॥ఎన్నెన్ని॥

ఆలోకం విడిచి నీవు కౌతవరం చేరినావా 

కౌతవరం చేరినీవు కొండాలమ్మ వైనావా 

కౌతవరం వస్తామమ్మో కొండాలమ్మ 

మొక్కుబడులు తెస్తామమ్మో కొండాలమ్మ

॥ఎన్నెన్ని॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!