🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*తుమ్మగుంట శ్రీ అయ్యప్ప క్షేత్రం - 4*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అంజనేయ స్వామి హితబోధ చేయుట*
అయ్యప్ప ఆజ్ఞమేరకు ఒక భక్తుని ధృడసంకల్పము భక్తుల కార్యదీక్ష సహాయ సహకారములతో అయ్యప్ప ఆలయ ప్రాంగణములో శ్రీకార్యసిద్ధి అభయాంజనేయ స్వామివారి భారీ విశ్వరూప విగ్రహ పత్రిష్ఠ జరిగినది ఈ స్వామిని దర్శించుటకు ఒక భక్తబృందము బస్సుదిగి రాజకీయ లోకాభి రామాయణము మాట్లాడుతూ వూరిలోనికి వచ్చుచుండ గ్రామ పొలిమేరనగల వంతెనవద్దకు రాగానే శ్రీ అంజనేయస్వామి భీకరరూపముతో నిలచి ఈ తుమ్మగుంట వేదభూమి మంత్రశాస్త్ర కల్పవృక్షము భక్తులను ఉద్దరించుటకు సాక్షాత్తు హరిహరపుత్రుడు స్వయముగా అరుదెంచి పావనముచేసిన చోటు భక్తులు శ్రద్ధాభక్తితో శరణుఘోష నామజపము సత్సాంగత్యముతో అరుదెంచ వలయును. అలా పాటించనిచో వెనుదిరిగి వెళ్లవచ్చునని ఆజ్ఞాపించుటతో పరవశమైన భక్తబృందము అయ్యప్ప అంజనేయ ధ్యానముతో వూరిలోనికి వెళ్ళి తమ మొక్కులు దీర్చుకొని సంతోషముతో తమ నెలవులచేరిరి. కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి భారిశిలావిగ్రహ మూర్తిని మండపమును శ్రీ పూండ్ల వెంకురెడ్డి గారలు సమర్పణ చేయగా , ప్రతిష్ఠ , కుంభాభిషేకములు భక్తుల సహకారముతో నిర్వహింప బడినది. అయ్యప్ప ఆలయములో సుబ్రహ్మణ్య విగ్రహ సమర్పణలు మందల. శంకరయ్య , వినాయక విగ్రహ సమర్పణము మిరియాల వెంకురెడ్డిగారలు.
*వృక్ష అయ్యప్ప పునః ప్రతిష్ఠ*
ప్రధమముగా ప్రతిష్ఠయైన అయ్యప్పస్వరూపమైన జువ్వి వృక్షము 1927 వ సంవత్సరములో ప్రకృతి వైపరీత్యమువల్ల భిన్నముకాగా స్వామివారు ఒక భక్తునికి స్వప్న దర్శన మొసంగి సన్నిధానములో మరియొక వృక్షమును పునః ప్రతిష్ఠచేయమని ఆనతివ్వగా గ్రామస్థులు ఒక శుభదినమున శివపూజా దురంధురులు జగన్మాత శ్రీరాజ రాజేశ్వరి దేవీ ఉపాసకులు మంత్రవేత్త ఋషి తుల్యులు తుమ్మగుంట ద్రవిడ బ్రాహ్మణ శాఖకులగురువు బ్రహ్మశ్రీ అరవత్తూరు. రామస్వామి సోమయాజులవారి ప్రవిత్రహస్తములతో నూతన వృక్షపునః ప్రతిష్ఠ ఆగమశాస్త్రాను సారముగా వైభవోపేతము గాజరిగినది. ఈ వృక్షమే నేడుమనకనుల విందుచేయువృక్ష అయ్యప్పగా విరాజుల్లుచున్నది. ఈతీరున ఈ సన్నిధానములో శతాబ్దములతరబడి నిరాకార మూలసిద్ధాంతముతో వృక్ష అయ్యప్ప పూజలు జరుగుచుండిన నేపధ్యములో భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపమేర్పరిచి అత్మానందము పొందసంకల్పించుట వారి అభిలాషకు స్వామివారు అనుజ్ఞయిచ్చుట గొప్పసంఘటన దీనిపై సన్నిధానములో స్వామి మూర్తి ప్రతిష్ఠకు సులువైనది.
*స్వామి అయ్యప్ప చిత్రపట ప్రతిష్ఠ*
స్వామి వారి అనుజ్ఞతో భక్తుల అభిమతానుసారం ఈ ప్రయత్నములో స్వామివారి సహస్రనామ పూజ విధానగ్రంథములో స్వామి వారి రూపురేఖలతో సింహరూఢులై వెంటసింహ సంతానములతో అద్భుతకాంతులతో విరాజిల్లు చిత్రపటము ను సేకరించి జీవకళలు వెదజల్లురీతిలో చిత్రమును రూపొందించి 1947 సంవత్సరము తై - పుష్యమి శుభ ముహర్తములో స్వామి అయ్యప్ప దివ్య రూప చిత్ర పటము శోభాయ మానముగా ప్రతిష్ఠించిరి. నాటి నుండి వృక్షమూర్తి పూజానంతరం చిత్రపటమునకు పూజానివేదనలు జరుగుటయేగాక ప్రతి సంవత్సరము తై - పుష్యమి జన్మదినోత్సవముగా లక్షపూజలు సింహవాహనముపై వైభవోపేతము గా గ్రామోత్సవము జరుగుచున్నది మరియు స్థానిక శ్రీ అన్నపూర్ణాదేవీ సమేత శ్రీకాశీవిశ్వేశ్వర స్వామివారల వార్షిక బ్రహ్మోత్సవములు తొలి రోజున ఈ చిత్ర పటములో ప్రార్థనోత్సవము జరుగుచున్నది. 1979 వ సంవత్సరము లో తిరుమల తిరుపతి దేవస్థానము , ఇతర దాతల ఆర్థిక సహాయముతో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ పునరుద్ధరణ , కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి సూచనల మేరకు శ్రీ వినాయక , శ్రీ సుబ్రహ్మణ్య , నవగ్రహ , స్వామి అయ్యప్ప శిలా విగ్రహములు ప్రతిష్ట , నూతనయంత్ర ప్రతిష్ఠలు , కుంభాభిషేకములు జరిగినివి. 2006 సంవత్సరమున ఆలయ ప్రాంగణములో నూతన మండవముపై భారీ స్వరూపముతో విరాజిల్లు శ్రీకార్యసిద్ది అభయాంజనేయ స్వామి వారి శిలావిగ్రహ ప్రతిష్ఠ మహా కుంభాభిషేకము అన్నదానము భక్తకోటి పరవశించే రీతిలో వైభవోపేతముగా జరిగినది.
*శ్రీ పూర్ణ పుష్కళాదేవీ సమేత ధర్మశాస్తా (కల్యాణ వరద శాస్తా (అయ్యప్ప చిత్రపట అవిష్కరణ*
ఈ క్షేత్ర విశిష్టత గమనించిన ఒక భక్తుడు ఎంతో శ్రమించి శ్రీపూర్ణ , పుష్కళాదేవీ సమేత కల్యాణ వరద (అయ్యప్ప) ధర్మశాస్తా చిత్రపటమును ప్రసాదించి కన్నులపండుగగా శ్రీశాస్తా కల్యాణము నిర్వహించుట అదిమొదలు ప్రతి సంవత్సరము జూన్ 3 వ తేది సన్నిధానములో శాస్తా కల్యాణము జరుగుచున్నది. ఇంతటి దైవబలమునకు నిదర్శనగా ఈ సన్నిధానములో వృక్షఅయ్యప్ప పశ్చిమ వైపునగల స్థానములో పాతాళనాగేశ్వర సన్నిధిలో ఒక నాగసర్పము అనాదిగా సంచారము చేయుచు విభ్రమముకలిగించుచున్నది. ఈ క్షేత్రములోని అయ్యప్ప ఆలయములో ప్రతి దినము ఉభయవేళలలో శ్రీవినాయకస్వామి , సుబ్రహ్మణ్యస్వామి , వృక్షఅయ్యప్ప , స్వామి అయ్యప్ప మూలవిరాట్ , నవగ్రహములు , నాగదేవత , శ్రీకార్యసిద్ధి అభయాంజనేయస్వామి వారికి అభిషేకములు అష్టోత్తర పూజలు , మహాలక్ష్మీ పూజ మహానివేదన కర్పూరహారతులు ఆగమశాస్త్రాను సారము అత్యంత వైభవముగా జరుగును. పర్వదినమున విశేష కార్యక్రమములు జరుగుచుండును. వీనిలో అతిప్రాముఖ్యత కలిగిన కార్యక్రమములలో
*శాస్త్రాకల్యాణము* స్వామి అయ్యప్ప గా అవతరించుటకు పూర్వము ధర్మశాస్తాగా అవతరించి శ్రీ పూర్ణ పుష్కళాదేవేరుల పరిణయమాడిన ధర్మశాస్తా కళ్యాణ వరద అయ్యప్పగా విరాజిల్లిన సందర్భమున శాస్త్ర బద్దముగా పురాతన గ్రంథముల ప్రమాణము , పూజానామముల అర్థముననుసరించి తుమ్మగుంట లో ప్రతిసంవత్సరము శాస్తా కళ్యాణమును జూన్ 3వ తేది జరుగుకార్యక్రమములో గణపతిపూజ అభిషేక పూజలతో పాటు గణపతి , శాస్తా , నవగ్రహ , చండి , మహాలక్ష్మి హోమములు , పూర్ణాహుతి శాస్తా కళ్యాణము , ముత్యాల తలంబ్రాలు , వివాహవిందు శ్రీ పూర్ణ పుష్కలా దేవీసమేతులైన ధర్మశాస్తా కళ్యాణ వరదఅయ్యప్పకు గ్రామోత్సవము జరుగును. ఈ కళ్యాణ తలంబ్రాలతో శీఘ్రముగా కళ్యాణము జరుగుట అద్భుతఘటన. ఇందులకు ఉభయకర్తలు నెల్లూరు నివాసులు బ్ర॥శ్రీ మాచవోలు రాజశేఖరంగారలు.
*శాస్తు , పంచాక్షర స్తోత్రము*
*'ఓం'* కార మూర్తి మార్తిఘ్నం దేవం హరిహరత్మాజం | శబరీపీఠనిలయం శాస్తారం ప్రణతోస్మ్యహం ॥
*'న'* క్షత్రనాదవదనం నాథం త్రిభువనావనం | నమితాశేష భువనం శాస్తారం నౌమిపావనం ॥
*'మ'* న్మథాయుధ సౌందర్యం మహాభూత నిషేవితం । మృగయారసికం శూరం శాస్తారం ప్రణతోస్మ్యహం ॥
*'శి'* వప్రదాయినం భక్త దైవతం పాండ్యబాలకం | శార్దూల దుగ్ధ హర్తారం శాస్తారం ప్రణతోస్యహం ॥
*'వా'* రణేంద్ర సమారుఢం విశ్వత్రాణ పరాయణం |
వేదోద్బాసి కరాం భోజం శాస్తారం ప్రణతోస్మ్యహం ॥
*'య'* క్షణ్యభిమదం పూర్ణ పుష్కళాపరిసేవితం |
క్షిప్రప్రసాదకం నిత్య శాస్తారం ప్రణతోస్మ్యహం ॥
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*