16. Gana Gana Gantalu Ganamuga / గణ గణ గంటలు - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

16. Gana Gana Gantalu Ganamuga / గణ గణ గంటలు - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
గణ గణ గంటలు ఘనముగా మ్రోగంగ
అయ్యప్ప నీ అభిషేకము జరుగంగా

కోటొక్క భక్తులు పాటలు వాడంగ
అబ్బబ్బ శబరిమల ధగ ధగ మెరిసే ఆ కోవెల
మణికంట నీ క్షేత్రము జూడ ముచ్చటగా
మణికంట నీ రూపము కన్నుల విందంటా
||గణ గణ గంటలు||
అల శబరీ శిఖరానా అంతెత్తు కొండల పైన
స్వర్ణ మందిర నిలయం అయ్యప్పా నీ దివ్య రూపం
చూసిన భాగ్యమటా నిన్ను కొలిచిన పుణ్య మటా
అయ్యప్పా అభిషేక ప్రియ మా అయ్యప్పా
అయ్యప్పా అలంకార ప్రియ అయ్యప్పా
||గణ గణ గంటలు||
అద్భుత మహిమల వాడా మా ఆపద్భందువు నీవే
మహిషిని కూల్చిన వాడా మా మంచి మార్పువు నీవే
నీదు భక్తిలోనా మాకు ముక్తి కలిగేనయా
మణికంట మా భారము అంతా నీదంతా
మణికంట నువ్వు లేని నేను లేనంటా
||గణ గణ గంటలు||
కుల మత భేదాలు లేక నీ మాలను వేసినమయ్య
సత్యము ధర్మమూ మాలో అణువణువున నిలిపిన మయ్యా
గుండె నిండా భక్తీ నింపి నీ గుడికొచ్చినము
శత కోటి భక్తులు నీ శబరి చూడంగా
ఆనందం పరమానందం అయ్యేనయ్యా
||గణ గణ గంటలు||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow