రామ జయ రామ రఘు సీతా రామ
రామ జయ రామ రఘు సీతా రామ
నీ నామము ఎంతో రుచి రా ఓ పావన నామ.. (2)
స్వామి నీకు ఒక బంటు రామ దూత హనుమంతు.
ఎంగిలి పళ్లను ఇచ్చెను శబరి మాత తనవంతు.
నా వంతున ఏమి రాత రసితివో రామయ్య...... (2)
హనుమంత పై ఉన్న కరుణ రవ్వంత నా పై చూపవేమయ్యా.. (రామ)
ఇసుకను రాల్చిన ఉడతను చేతితోన నిమిరావు..
గంగను దాటించి గుహుని గుండెలలో నిలిచావు..
నిండు భక్తితో నీ గుడి ముంగిటలో నీలి చావు..... (2)
నా అండ దండ నీవని కోదండ రామ కొలిచాను.... (రామ)
రాతిని నాతిగ చేసిన క్యాతి నీకు ఉందయ్య...
పాదుకలే గద్దెనెక్కి పాలన చేసేనయ్య...
బ్రమ్మ కడిగిన పాదం నెదే కద రామయ్య.....(2)
నా బ్రతుకు లోన వెలుగు రాత నేవే కదా రామయ్య... (రామ)