రావా మణికంఠ స్వామి - మా ఇంటికి ||2||
పూజ ఉన్నది - మంచి భజనున్నది ||2||
ఆపైన మంచి విందున్నది
దూప దీపాలతోటి - హారుతున్నది ||2||
పంచామృతాలతోటి స్నానమున్నది ||2||
||రావా మణికంఠ ||
సన్నా సన్నాని బియ్యం - అన్నమున్నదిపుల్లా పుల్లని - పులిహోర ఉన్నది ||2||
నీకెంతో ఇష్టమైన - పాయసంబున్నది
||రావా మణికంఠ||
పాలకూర పప్పేసి - ఆలు వంకాయేసిరవ్వలడ్డూలతోటి పంచామృతాలతోటి ||2||
తెనేతోటి విందు ముందున్నది
||రావా మణికంఠ||
గరం గరం అప్పడాలు - ఘుమ ఘుమ సాంబారువేడి వేడి మిర్చీలతో - మెత్త మెత్త పూరీలతో ||2||
గట్టి గట్టి పెరుగుతో విందున్నది
||రావా మణికంఠ||
ధూపా దీపాలతోటి హారతున్నది ||2||పంచామృతాలతోటి స్నానమున్నది ||2||
||రావా మణికంఠ||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.