స్వామి గీతాలే పాడుదును - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


స్వామి గీతాలే పాడుదును నారద తుంబుర ధోరణిలో  ||2||

జపమాల లేదండి చేతిలో మంత్ర శృతి మీటే తంబుర గానీ..  ఈ.ఈ.ఈ.  ||2||

స్వామి అయ్యప్పస్వామి శబరిగిరిస్వామీ.... | ||2||

| స్వామి గీతాలే ||


ప్రాతః కాలాన పుణ్యక్షేత్రాన బంగరు నేలపై కురుచుని ||2|| స్వర్ణగిరినాధ అయ్యప్పా నిన్నే పుణ్యాక్షర గీతం పాడీ.. ||2|| ఏదో దివ్యానుభూతిని పొంది..

|| స్వామి గీతాలే ||


మనుషులొకటైన సత్యం నాకు మణికంధరస్వామి సెలవిచ్చే  ||2||

మదమాత్సర్యాలు వలదే వలదని హితోపదేశం కావించే ||2|| మహితోపదేశం కావించే.. |

| స్వామి గీతాలే ||


ఉపదేశ సారాలు నన్నెంతో కదలించే.. నాలోని భావాలు రేపి  ||2||

ఈ విశ్వమంతా నీ నామ స్మరణే మారుమోగేలాగ చేతూ.. మారుమోగేలాగ చేతూ....   ||2||

|| స్వామి గీతాలే ||

స్వామి అయ్యప్పస్వామి శబరిగిరిస్వామీ.....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!