స్వామి దింతకతోమ్ తాండనతం అయ్యప్ప దిందకతోమ్ ...|| 2||
నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగెను నవ చైతన్యం|| 2||
నీ దివ్య స్వరూపమే కన్నులలోన
నీ భవ్య శరణు ఘోష కంఠములోన
నీ మంగళ ప్రతిమ తులసి మాల మెడను వేయగా
నా గుండెలోనే నీజ్యోతి నిండి వెలిగెను
||||నీ దీక్ష||
నా హృదయం ఒక తంబుర నీ నామం నాదంల నా జీవన గానం లో నను వదలక నిను వేడా
నీ తలపులు నా తలలో నిరంతరం సాగాలి నా తలపై ఇరుముడివై నీ చెంతకు నడవాలి
నాడులలోనవ నాడులలో జీవదారవైనావయ్యా
నా ఆత్మజ్యోతి వెలుగనిన్ను జ్యోతి స్వరూపా
||నీదీక్ష ...||
వేదభాష్య శాస్త్రాల పేరైనా తెలిసేనా ఆ గీతారహస్యాలు అవగాహనమయ్యేనా
సాధారణ మానవుడాకు సమకూరున విజ్ఞానం భక్తి మార్గమొకటేగా పాటించేగా మాకు గతి
పదములనే కొలిచి పదములుగా పదములలో భక్తి నింపి ప్రాణమున్న వరకు గాన సేవ చేసేదనయ్యా |
|నీదీక్ష ...||