తందానే తందానే అయ్యప్పస్వామి వందానే వందానే ఆర్ముగస్వామి l అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 తందానే తందానే అయ్యప్పస్వామి 

వందానే వందానే ఆర్ముగస్వామి.  //తందానే//


| మోహినీ తనయుడప్ప అయ్యప్పస్వామి 

పార్వతీ పుత్రుడప్ప ఆర్ముగస్వామి. //తందానే//


అడవిపులి వాహనుడప్ప అయ్యప్పస్వామి 

వన మయూరి వాహనుడప్ప ఆర్ముగస్వామి. //తందానే//


అయిదు గిరులకధిపతప్ప అయ్యప్పస్వామి 

ఆరుగిరుల కధిపతప్ప ఆర్ముగస్వామి. //తందానే//


శరణుఘోష లోలుడప్ప అయ్యప్పస్వామి 

హరోం హర పాలుడప్ప ఆర్ముగస్వామి. //తందానే//


ఇరుముడి ప్రియుడప్ప అయ్యప్పస్వామి 

కావడి ప్రియుడప్ప ఆర్ముగస్వామి //తందానే//

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!