స్వామియే శరణమయ్యప్పా... అయ్య రోయ్ శరణమయ్యప్పా.. మాలను మెడవేసి, నియమాలు పాటిస్తూ...... కొండలన్నీ దాటి దాటి అయ్యనే చూడాలి.
సంపదలా.... సౌఖ్యాలా..... భాగ్యాలా శబరిమలా
మణికంఠుడు ఉండేతావు. భక్తులు శతకోటి మొక్కుబడులు చెల్లింపగ వచ్చేరు
శరణం అని పడివచ్చేరూ....... స్వామి శరణం అని పడి వచ్చేరూ.........
ఓ అయ్య, మా అయ్య, బాబయ్య, పెద్దయ్యరో..... శరణు శరణు శరణు శరణు స్వాములు
॥సంపదలా॥
గౌరీశుని చిన్నితనయుడా... స్వామి కలికాల సంభవుడా......
||2|
పంపానదీ తీరాన...... స్వామి పుట్టినవాడవు నీవయ్యా 12: వేటకు, ఓహెూ... వెళ్ళగా, ఓహో.....
వేటకు వెళ్ళగా - వేటలో రాజుకు, కనిపించే ఈబాబు కనులపండుగ ॥2॥
ఓ అయ్య, మా అయ్య, బాబయ్య, పెద్దయ్యరో..... శరణు శరణు శరణు శరణు స్వాములు
సంపదలా॥
విల్లాలి వీరుడవై....... స్వామి వీర మణికంఠుడవై.......||2||
పులివాహన రూఢుడై.... స్వామి మహిషాసుర మర్ధనుడై...... ||2||
వెలసెను, ఓహెూ..... మా కోసం, ఓహెూ......
వెలసెను మా కోసం - దర్శనం మా కోసం, చూస్తే చాలయ్యా ఆ విగ్రహం
ఓ అయ్య, మా అయ్య బాబయ్య, పెద్దయ్యరో..... శరణు శరణు శరణు శరణు స్వాములు
॥2॥
ముడుపు మూట తలమీద పెట్టుకొని, కరిమల నీలిమల ఎక్కుతూ దాటుతూ
పద్దెనిమిది మెట్లు ఎక్కుతూ దాటుతూ, శరణం శరణమంటూ పాడుతూ వచ్చేము
ముక్తినియి, ఓహెూ.....మోక్షమియి, ఓహెూ ......
ముక్తినియి మోక్షమియి, ఆడుతూ పాడుతూ వచ్చేటి భక్తులకు అభయమియ్యి 2.
ఓ అయ్య, మా అయ్య, బాబయ్య, పెద్దయ్యరో..... శరణు శరణు శరణు శరణు స్వాములు
సంపదలా