విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మా బొట్టు, గాజులు, పసుపుకుంకుమలు, పట్టుచీరలు తెచ్చినాము తల్లీ
1. అమ్మలగన్నా అమ్మవు నీవే ఆదిపరాశక్తివి నీవే॥2॥
ఆత్మగల మా తల్లివి నీవే అవతార మూర్తివి నీవేనమ్మా
జగములునేలే మా జగదాంబ దారి చూపి మా పూజలందుకోవే
2. కంచిలోన కామాక్షివి నీవే మధురలోన మీనాక్షివి నీవే ॥2॥
కాశిలోన విశాలాక్షివే కలియుగమందున కనకదుర్గవే
మహిషాసుర మర్థిని నీవమ్మా మము కరుణించి సిరులు కలిగించవే
3. అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్న మా కనకదుర్గవే ॥2॥
అండదండ మా తోడుగ ఉండి - ఆదరించె ఆరాధ్య దేవివే
పిలిచిన పలికే మా కల్పవల్లి కలకాలం మము చల్లంగ చూడమ్మా
4. యుగయుగాలుగా ఈ జగమందున దుష్ట శిక్షణ చేసితివమ్మా ॥2॥
ఇంటింట ఇలవేల్పుగ వెలసి భక్తుల బాధలు తీర్చినవమ్మా
నిన్నే నమ్మిన భక్తులమమ్మా వెన్నంటి మా తోడు ఉండవమ్మా