అభిషేకము చేద్దము రారండి / Abhishekam Cheddam Rarandi - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


 అభిషేకము చేద్దము రారండి

అభిషేకము చేద్దము రారండి మన అయ్యప్పస్వామికి
అభిషేకము చేద్దము రారండి ||2||


గోవుల మందకు మనమే వెళ్ళి
గోమాత పాలను తీసుకువచ్చి ||2||
స్వామి వారికి పాలాభిషేకం ఆ............
స్వామి వారికి పాలాభిషేకం
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
                                     ||అభిషేకము||


గోవు పాలను తీకువచ్చి
గోవుపాలనే పెరుగుగా మలచి స్వామి
వారికి దద్యాభిషేకం ఆ............
స్వామి వారికి దద్యాభిషేకం
చేసిన జన్మ ధన్యము చేసిన వారికి పుణ్యము
                               | |అభిషేకము!!


 గోమాత పెరుగును తీసుకువచ్చి
గోమాత పెరుగునే నెయ్యిగా మలచి
స్వామి వారికి నెయ్యా భిషేకం ఆ..........
స్వామి వారికి నెయ్యాభిషేకం
చేసిన జన్మధన్యము చేసిన వారికి పుణ్యము
                                | |అభిషేకము|


చెట్టు పుట్టలు మనమే తిరిగి
పుట్ట తేనెనే తీసుకువచ్చి
స్వామివారికి తేనాభిషేకం ఆ........
స్వామి వారికి తేనాభిషేకం
చేసిన జన్మధన్యము చూసిన వారికి పుణ్యము
                               అభిషేకము!!


చెరకు తోటకు మనమే వెళ్ళి
చెరకు గడలను తీసుకువచ్చి
చెరకు గడలను చెక్కెరగా మలచి
స్వామి వారికి చక్కెరాభిషేకం ఆ.............
స్వామి వారికి చక్కెరాభిషేకం
చేసిన జన్మధన్యము చూసిన వారికి పుణ్యము..
                               ||అభిషేకము!!


పండ్ల తోటకు మనమేవెళ్ళి
రకరకాల పండ్లను తెచ్చి
స్వామి వారికి పంఢాభిషేకం ఆ..........
స్వామి వారకి పంఢాభిషేకం
 చేసిన జన్మధన్యము చూసిన వారికి పుణ్యము
                                   ||అభిషేకము||



కొబ్బరి వనమునకు మనమే వెళ్ళి
నారికేళము తీసుకవచ్చి తెచ్చి
స్వామి వారికి పలోదగ్గస్నానం ఆ...........
స్వామి వారికి పలోదగ్గస్నానం
చేసిన జన్మధన్యము చూసిన వారికి పుణ్యము
                                 ||అభిషేకము!!



సిరిసిరి మువ్వల అయ్యప్పా
మా చిన్నారి నవ్వుల అయ్యప్పా
వీరాధి వీరుడవు అయ్యప్పా
వీరమణికంఠుడవు అయ్యప్పా



ఆవు పేడతో పిడకను చేసి
ఆవు పిడకతో భస్మము తీసి
స్వామి వారికి భస్మాభిషేకం......
చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము
                                     ||అభిషేకము||


అష్టగంధ మూలిక తెచ్చి
స్వామి వారికి చందనాభిషేకం ఆ........
స్వామి వారికి చందనాభిషేకం
చేసిన జన్మధన్యము చూసిన వారికి పుణ్యము
                                     ||అభిషేకము||


 ఎర్ర చందనం తీసుకువచ్చి
స్వామి వారికి కుంకుమాభిషేకం ఆ.....
స్వామి వారికి కుంకుమాభిషేకం
చేసిన జన్మధన్యము చూసిన వారికి పుణ్యము
                                        ||అభిషేకము!!


మంచి  నీటిని  తీసుకువచ్చి
స్వామివారికి పన్నిరాభిషేకం  ఆ......
స్వామి వారికి పన్నిరాభిషేకం
 చేసిన జన్మధన్యము చూసిన వారికి పుణ్యము
                                          | |అభిషేకము!!



పంబా జలము తీసుకువచ్చి
స్వామివారికి శుద్దోదగ్గ స్నానం  ఆ......
స్వామి వారికి శుద్దోదగ్గస్నానం
 చేసిన జన్మధన్యము చూసిన వారికి పుణ్యము
                                          | |అభిషేకము!!


పూలతోటకు మనమేవెళ్ళి
రకరకాల పూలను తెచ్చి ||2||
స్వామి వారికి పుష్పాభిషేకం ఆ.............
స్వామి వారికి పుష్పాభిషేకం
చేసిన జన్మధన్యము చూసిన వారికి పుణ్యము
                                        ||అభిషేకము!!


ధూపం, దీపం తీసుకు వచ్చి,
భక్తితోన స్వామిని తలచి
స్వామి వారికి హారతులు ఇయ్య ఆ............
స్వామి వారికి హారతులు ఇచ్చిన జన్మధన్యము
చూసిన వారికి పుణ్యము
                                         ||అభిషేకము!!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!