అమితానందం పరమానందం అయ్యప్పా
అమితానందం పరమానందం అయ్యప్పా
నీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్పా
స్వామి అయ్యప్పా శరణమయ్యప్ప
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
హరియే మోహిని రూపం హరుడే మోహన రూపం
హరిహర సంగ మం అయ్యప్ప జననం
ముద్దులొలుకు ఆ సంభవం
స్వామి అయ్యప్పా శరణమయ్యప్ప
పుట్టుట పంబా తీరము
పెరుగుట పందళ రాజ్యము కంఠమందు మణిహారం
మణికంఠా నీ నామము
స్వామి అయ్యప్పా శరణమయ్యప్ప
పులిపాలకడవి ప్రయాణం
మదిలో మహిషి సంహారం
ఇంద్రుడే వన్ పులి వాహనం ఇచ్చెను శబరి కి మోక్షము
స్వామి అయ్యప్పా శరణమయ్యప్ప