స్వాగతాలు స్వాగతాలు స్వాములారా / Swagataalu swagataalu swamulara - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

స్వాగతాలు స్వాగతాలు స్వాములారా ॥2॥ స్వామి పూజకు అయ్యప్ప పూజకు ॥2॥

జంటలుగా రారండి స్వామి శరణు కోరండి ॥2॥

॥ స్వాగతాలు ||

ఎన్నో దినముల దీక్షలోన - ఎన్నెన్నో తప్పులను చేసినాము ॥2॥ తప్పులన్ని ఒప్పుకుంటే శరణు మీకు కలదండి ॥2॥

॥ స్వాగతాలు ||

భక్తి కొలది చేయు పూజ - ముక్తి కొరకు చేయు పూజ ॥2॥ 

భక్త కోటి చేసేది భక్తితో ఈ ! పూజ ॥2॥

॥ స్వాగతాలు ॥

మనుజ జన్మ సార్థకానికి - మేమెరిగిన మార్గ మొక్కటే ॥2॥ 

మకర జ్యోతి దర్శనం మీకు చూపు నిదర్శనం ॥2//

॥ స్వాగతాలు






#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!