దనసు బాణం చేతబట్టి దండిగ పెద్దపులిని ఎక్కి ॥2॥
ధరలోన ధర్మశాస్తా . . దండమిదిగో స్వామి మా దరికి రావేమి ॥4॥
ఏటేట మాల వేసి వేడుకతో పూజచేసి ॥2॥
నల్లాని బట్టలేసి నొసటిన గంధంను బెట్టి॥2॥ ఇంటింటా భజన చేసి భక్తితో ఇరుముడిని కట్టి ॥2॥
బయలుదేరి వస్తున్నా భక్తులము స్వామీ మాకభయమీయవేమి
॥ధనసు బాణం॥
బ్రహ్మచర్య వ్రతము బట్టి బ్రాంతులన్ని వదిలిపెట్టి ॥2॥
శబరిమల చేరుకుంటి చేతులెత్తి మొక్కుకుంటి॥2॥
పంబానదిలో స్నానమాడి వినయముతో పూజలీడి ||2||
పరవశమోందితి స్వామీ పారిపోయె స్వామి పాపాలు మమ్మువీడి ॥2॥
॥ధనసు బాణం||
ముడుపు మొక్కులిచ్చుకుంటి ముక్తినాకు ఇవ్వమంటి ॥2॥
మకరజ్యోతి చూచి నిన్ను మనసు నిండ నింపుకుంటి ॥2॥
పెద్ద పెద్ద అడవి చూడు పెనుగాలి విసురు చూడు ॥2॥
మహిషిని మర్ధించినావు... మము మన్నించవేవి మాదరికి రావేమి
॥ధనసు బాణం||