శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్ప(2)
స్వామియే శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం స్వామి అయ్యప్ప
అయ్యవారు ఉండేది కైలాసమ్
అమ్మవారు ఉండేది వైకుంఠం
అన్న గారు ఉండేది ఫలనిమాల
స్వామి వారు ఉండేది శబరిమల
హర హర అంటారు అయ్యవరిని
హరి హరి అంటారు అమ్మవారిని
హరోం హర అంటారు అన్న గారిని
శరణం శరణం అంటారు స్వామి వారిని
వృషభ వాహనం అయ్యవరిది
గరుడ వాహనం అమ్మవారిది
నెమలి వాహనం అన్న గారిది
వన్ పులి వాహనం స్వామి వారిది