పుట్టెడు దుఃఖం ఉన్నా గాని అయ్యా అయ్యప్పో
నా స్వామి అయ్యప్ప
నీ పూజ నేను మరువనయ్య అయ్య అయ్యప్ప
నా స్వామి అయ్యప్ప..... ||2||
తండ్రి వని నిన్ను అనుకున్నా
తనయుడని నన్ను అనుకోరా ||2||
దాగ లేదు కష్టాలన్నీ అయ్యా అయ్యప్ప ||2||
నీ ఒడిలో నన్ను ఒదార్చయ్య స్వామి అయ్యప్ప
కష్టాలన్నీ ఒక్కసారిగా కట్టగట్టుకొచ్చిన గాని ||2||
కళ్ళారా నిన్నే చూడ అయ్యా అయ్యప్పా ||2||
నీ కొండ నడిచి వస్తానయ్య అయ్యా అయ్యాప్పా....
కురిసేటి జల్లుల వోలే కారేటి కన్నీటితో ||2||
కాళ్ళు నీవి కడిగి వస్తా అయ్యా అయ్యాప్ప ||2||
నీ కడుపులో నా దాచుకొర స్వామి అయ్యప్ప
కష్టం ఉంది పోకుర బిడ్డా అంటూ అమ్మ అంటున్న
దారిలోనా బద్రం కొడకా అంటూ అయ్యా చెబుతున్నా ||2||
ఎందరు వద్దన్నా కానీ అయ్యా నేను వసున్న ||2||
వట్టి చేతులతో నన్ను పంపకురా నా అయ్యప్ప